వైభవంగా ముగిసిన మహాలక్ష్మి ఆలయం జాతర
-ఆకట్టుకున్న కుస్తీల పోటీలు
మనోరంజని ప్రతినిది
తానూర్ జనవరి 19
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని మొగిలి గ్రామంలో గత రెండు రోజులుగా జరుగుతున్న శ్రీ మహాలక్ష్మి ఆలయం జాతర శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ముగిసింది,ప్రతి సంవత్సరం లాగే ఈఏడు కూడా జాతర,కూస్తీ పోటీల కోసం ఆలయ,విడీసీ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు,ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జాతర ఉత్సవాలను ప్రారంభించారు..
-జాతరలో భారీగా వేలిసిన దుకాణాలు….
జాతరలో భారీగా దుకాణాలు వేల్వడడంతో మహిళలు,యువతులు గాజులు కొనుగోలు చేయగా,చిన్నారులు ఆట వస్తువులు,మిఠాయిలు కొనుగోలు చేశారు,యువతి -యువకులు జాతరలో వెలసిన రంగుల రాట్నంలో కూర్చొని కేరింతలు వేశారు..
-ఆకట్టుకున్న కుస్తీల పోటీలు…
ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడు కూడా శ్రీ మహాలక్ష్మి ఆలయం జాతర సందర్భంగా ఆలయ,విడీసీ కమిటీల ఆధ్వర్యంలో గ్రామ సమీపంలో గల రోడ్డు పక్కన మైదానంలో కుస్తీ పోటీలు నిర్వహించారు,ముందుగా మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి,బాజ భజంత్రిలతో గ్రామస్తులు కుస్తీ పోటీల మైదానానికి చేరుకున్నారు,
మొదట చిన్నారులతో కుస్తీ పోటీలను ప్రారంభించారు,ఈ పోటీలను తిలకించడానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తోపాటు,మండల నాయకులు పాల్గొని కుస్తీ పోటీలను తిలకించారు,ఎమ్మెల్యేను ఉత్సవం కమిటీ సభ్యులు సన్మానించారు,ఈ కుస్తీల పోటీలు తిలకించడానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు,భక్తులు సహితం అధిక సంఖ్యలో తరలివచ్చి కుస్తీ పోటీలను తిలకించారు,ఈ కుస్తీ పోటీల్లో మొదటి బహుమతిగా రూ,7051,
ద్వితీయ బహుమతిగా 5051రూపాయల నగదును అందించారు,ఈ పోటీల్లో తలపడి గెలుపొందిన ప్రతి మల్లయోధునికి బహుమతులు అందజేశారు..
-పోలీసుల గట్టి బందోబస్తు…
శ్రీ మహాలక్ష్మి జాతర,కుస్తీ పోటీల సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తానూర్ ఏస్సై డి.రమేష్ ఆధ్వర్యంలో పోలీసుల గట్టి బందోబస్తు నిర్వహించారు,జాతర ప్రశాంతంగా ముగిసింది..
ఈ కార్యక్రమంలో ఆలయ,విడీసీ కమిటి సభ్యులు,
మండల ప్రజా ప్రతినిధులు,నాయకులు,పోలీస్ సిబ్బంది,గ్రామస్తులు,యువకులు,తదితరులు,
పాల్గొన్నారు