ఉదారత చాటుకున్న మిత్రబృందం

ఉదారత చాటుకున్న మిత్రబృందం

మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్‌కి 10,000ల విరాళం

మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరు (ఎల్‌ఐసి ఆఫీస్ ఎదురుగా) ఆగస్టు 25

ఒక పబ్లిక్ ప్రదేశంలో స్నేహితుల బృందం విహరించుచుండగా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్‌ చైర్మన్ మోరే లక్ష్మణరావు కలుసుకున్నారు. ఆ ఎన్జీవో చేపడుతున్న పేదల సంక్షేమ కార్యక్రమాలు, సేవా యజ్ఞం చూసి మిత్రులు అమితంగా ఆకట్టుకున్నారు. దాంతో వెటర్నరీ డాక్టర్ శ్రీధర్ రెడ్డి , గుండ్లూరు చిన్న , మాచీ శివ , (క్లోత్ మార్కెట్) రంగనాథం , శ్రీను గునిసెట్టి , రమేష్ కుమార్ , బాబు , బంగార్ రెడ్డి , శ్రీను (గోల్డ్‌స్మిత్), నారాయణ రెడ్డి , మాధవ్ రెడ్డి కలిసి రూ. 10,000/- విరాళం అందజేశారు. చైర్మన్ మోరే లక్ష్మణరావు మాట్లాడుతూ ఇలాంటి స్నేహితుల దానం నిజమైన బంధానికి ప్రతీక. స్నేహం అనేది కేవలం కలసి ఉండడమే కాదు, సమాజానికి తోడుగా నిలబడటమే అసలైన అర్థం అని అభిప్రాయపడ్డారు. ఫౌండేషన్ సభ్యులు అందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సేవే మానవత్వం ఇలాంటి సహాయం మా కార్యక్రమాలకు మరింత బలాన్నిస్తుంది” అని సభ్యులు పేర్కొన్నారు. స్నేహం నిజమైనప్పుడు, అది సేవ రూపంలో వెలుగుతుంది అని స్థానికులు కూడా ఈ మిత్రబృందాన్ని ప్రశంసించారు. ఆగమనంలో ఉన్న వినాయక చవితి సందర్భంగా, “వినాయకుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ వీరందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటున్నాం” అని ఫౌండేషన్ తరఫున ఆశీస్సులు అందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment