మానవత్వం నిలిపిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
గుర్తుతెలియని మృతదేహానికి చివరి వీడ్కోలు
మనోరంజని ప్రతినిధి, ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 06
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మరణించగా ఐదు రోజులుగా బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో రూరల్ పోలీసు సిబ్బంది “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు శనివారం సాయంత్రం హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, ట్రెజరర్ భార్గవ్ సాయి, అహమ్మద్ హుస్సేన్, కుళాయి రెడ్డి, నవీన్, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు పాపిశెట్టి వెంకటాలక్ష్మ్మ, సుమన్ బాబు, ప్రసన్నకుమార్ తదితరులు సహకరించారు. ఈ మానవత్వపూర్వక కార్యక్రమంలో పాలుపంచుకున్న అందరికీ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు సంప్రదించవలసిన నంబర్లు:
📞 82972 53484, 91822 44150