30 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమి

30 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమి

ఆధారాలు చూపించిన దళిత మహిళా కదం జనా బాయి

మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి అక్టోబర్ 27

30 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమి

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన దళిత మహిళా కదం జనా బాయి తన భూమిపై అనవసర ఆరోపణలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం సర్వే నంబర్‌ 130/ఆ/1లో 1 ఎకరం 20 గుంటల భూమిని తనకు కేటాయించిందని, అప్పటి నుంచి అదే భూమిలో పంట సాగు చేస్తూ బ్యాంకు రుణాలు కూడా పొందినట్లు తెలిపారు. జనా బాయి మాట్లాడుతూ నా వద్ద ప్రభుత్వ పత్రాలు ఉన్నాయి. కానీ కొందరు వ్యక్తులు కావాలని ఆరోపణలు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. వాస్తవాలు నిర్ధారించి నాకు న్యాయం చేయాలి అని కోరారు. ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందిస్తూ గత రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై కొందరు కావాలని చేసిన ఆరోపణలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని సూచించాం. గతంలో పట్టాలు, పత్రాలు ఉన్న వారిని, లేని వారిని గుర్తించి నలుగురిని తొలగించాం అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment