ట్రిపుల్ ఐటి విద్యార్థి స్వాతిప్రియ ఆత్మహత్యపై విచారణ సజావుగా జరగాలి

ట్రిపుల్ ఐటి విద్యార్థి స్వాతిప్రియ ఆత్మహత్యపై విచారణ సజావుగా జరగాలి

విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలి

బాసర ట్రిపుల్ ఐటిలో జరుగుతున్న పలు సంఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర ఈసీ సభ్యులు సూర్యవంశి మాధవరావు పటేల్

 ఎమ్4 ప్రతినిధి ముధోల్

బాసర ట్రిపుల్ ఐటీ లో  విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్య ఘటన రోజురోజుకు మలుపు తిరుగుతుందని త్రిపుల్ ఐటీ అధికారులపై కేసులు నమోదు చేసిన దృష్ట్యా వాస్తవాలను బహిర్గత పరచాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) స్టేట్ ఈసీ మెంబర్ సూర్యవంశి మాధవరావు పటేల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్ చేసుకుందని ఇప్పటివరకు చెప్పిన అధికారులు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇద్దరు డీన్లు, కేర్ టేకర్ పై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయంలో పలు అనుమానాలకు తావిస్తున్నదని వాస్తవాలను బహిర్గతం చేయాలని ఆయన కోరారు. లోతైన విచారణ జరగాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరుస ఘటనలతో గాడిదప్పుతున్న భావిభారత నిర్మాణ కర్మాగారమైన బాసర ట్రిపుల్ ఐటి విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉందని ఆయన అన్నారు. బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం సమాజాన్ని తీవ్రంగా కలచివేసే అంశమని అన్నారు. భారత భావి పౌరులు ఆత్మహత్యకు పాల్పడడం పై ప్రభుత్వం స్పందించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి సంఘటనలు పునావృత్తం కాకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో జరుగుతున్న పలు ఘటనలకు సమగ్ర విచారణకై ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment