పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించాలి

పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించాలి

పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించాలి

ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 30

పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పునర్ నిర్మించాలని ముధోల్ హిందూ ఉత్సవ కమిటీ హిందూ వాహిని ఆధ్వర్యంలో తహసిల్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ హైదరాబాద్ పట్టణంలో పెద్దమ్మ తల్లి ఆలయా కూల్చివేయడన్ని తగదని పేర్కొన్నారు. ప్రభుత్వం హైడ్రా అధికారులచే హిందూ భక్తుల విశ్వాసానికి ప్రతిగాక నిలిచినా పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చడం హిందూవుల మనోభావాలు తెబ్బతీయడమేనని అన్నారు. కొన్ని దశాబ్దాల కాలం నాటినుండి పూజలు చేస్తున్న ఆలయం కూల్చి వేయడమే కాకుండా అమ్మవారి విగ్రహాన్ని ప్రభుత్వం గొప్యంగా దాచి ఉంచారని వాపోయారు. ప్రభుత్వనికి కూల్చినటువంటి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని 1000 గజాల స్థలంలో పునర్నిర్మాణం చేపట్టి ఆలయాన్ని ఎవరి పరివేక్షణలో కూల్చినారో అట్టి అధికారులను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందువులంతా కలిసి రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ హిందూ ఉత్సవ కమిటీ, హిందు వాహిని సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment