*రంగ రంగ వైభవంగా మన్యంకొండ జాతర*
మనోరంజని ప్రతినిధి*
మహబూబ్ నగర్ జిల్లా: ఫిబ్రవరి 13
మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్త జనసాంద్రమైంది, భక్తుల గోవిందా నామస్మరణంతో ఆలయ గిరులు మారుమోగాయి. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ బుధవారం రాత్రి మొదలు కొని.ఈరోజు తెల్లవారుజా మున వరకు మారు మ్రోగింది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవం వేడుకలను తిలకించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుండే కాకుండా.. కర్ణాటక.. మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ ఎత్తున తరలి రావడం ఆనవాయితీగా వస్తుంది. వాహనాలు.. ఎద్దుల బండ్లలో బుధవారం సాయంత్రానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
కొండ పై నుండి స్వామివారి ని మంగళ వాయిద్యాల నడుమ.. పల్లకి సేవ నిర్వహిస్తూ రథం వద్దకు తెచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చిన భక్తజనం వేడుకలలో భాగం పంచుకొని పులకించారు. పాలమూరు ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమానికి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ లహరి మధుసూదన్, ఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.