మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి జూలై 17 : మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి. గురువారం చేవెళ్ల పట్టణంలోని కేజిఆర్ గార్డెన్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం ఉపాధి కోసం డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోడ్పాటు ఎప్పటికీ ఉంటుందన్నారు. మహిళా బాగుంటే ఆ కుటుంబం కూడా బాగుపడుతుందన్నారు. ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా శక్తి సాధ్యమవుతుంది.నాలుగు కోట్ల 96 లక్షల రూపాయలను బ్యాంకు రుణాల 41 కోట్ల 10 లక్షల రూపాయలను మహిళా డ్వాక్రా సంఘాలకు వారు చెక్కులు అందజేశారు.అనంతరం ఇందిరమ్మ డ్వాక్రా మహిళామణులకు శాలువాతో సన్మానం చేశారు.మహిళల సాధికారత, పేదలకు న్యాయం కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని వారు అన్నారు.మహిళల పేరు మీదే రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల వస్తున్నాయి అని అన్నారు.కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డిఆర్డిఓ శ్రీలత ,చేవెళ్ల ఆర్డిఓ చంద్రకళ,మహిళా సంఘం నాయకురాలు కోట లక్ష్మి,గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్,పెంటయ్య గౌడ్, గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి,పార్టీ నాయకులు, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు..