ప్రొద్దుటూరు – గుర్తు తెలియని యాచకుడి అంత్యక్రియలు మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
మనోరంజని తెలుగు టైమ్స్, ప్రొద్దుటూరు — నవంబర్ 18
స్థానిక ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని యాచకుడు మరణించగా, ఆయన అంత్యక్రియలకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది మే ఐ హెల్ప్ యూన్ ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్‌కు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఫౌండేషన్ సభ్యులు స్పందించి, మంగళవారం రోజు హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి చేయూతనిచ్చిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, అహమ్మద్ హుస్సేన్, వైస్ ప్రెసిడెంట్
మునీంద్రా, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు మైఖేల్ బాబు, కిరణ్ కుమార్ మరియు ఇతరుల సేవలను స్థానికులు అభినందించారు.మా శ్రీ అమ్మ శరణాలయం వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు క్రింది నంబర్లను సంప్రదించవలసిందిగా ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది—
📞 82972 53484
📞 91822 44150