బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

ఇంద్రకరణ్ రెడ్డి గంగాధర్ పటేల్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

తానుర్ : అక్టోబర్ 21

నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని సింగన్గావ్ గ్రామంలో ఇటీవలే మొదటి ఎంపీపీగా పనిచేసిన గంగాధర్ పటేల్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనతో పాటు మాజీ ఎంపీపీ పని చేశారని గుర్తు చేశారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ రాజన్న, మండల నాయకులు పోతారెడ్డి, నంద్గామ్ మాజీ సర్పంచ్ అబ్దుల్ గని, సింగన్గామ్ మాజీ సర్పంచ్ బాలాజీ, ఉపసర్పంచ్ సుధాకర్, కార్యకర్తలు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment