ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

 హైదరాబాద్:ఆగస్టు 04

ఝార్ఖండ్ మాజీ ముఖ్య మంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు శిబూ సోరెన్ (81) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

జూన్ చివరి వారంలో కిడ్నీ సంబంధిత సమస్యతో శిబు సోరెన్ ఆసుపత్రిలో చేరారు. గురూజీ అని ముద్దుగా పిలువబడే సోరెన్.. ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

గిరిజన, అణగారిని వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.ప్రస్తుత ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన కుమారుడు. తన తండ్రి మరణాన్ని ధృవీకరిస్తూ హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు.

ప్రియమైన దిశోం గురూజీ మనల్ని విడిచిపెట్టారు. ఈ రోజు నేను ప్రతిదీ కోల్పోయాను” అని ఆయన పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆస్పత్రికి వెళ్లి శిబు సోరెన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment