శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధికి భక్తుల పాదయాత్ర

శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధికి భక్తుల పాదయాత్ర

శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధికి భక్తుల పాదయాత్ర

తానూర్‌లో భక్తులకు ఘన స్వాగతం-ఫలాల పంపిణీ

తానూర్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తానూర్ మండలం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బాసర పుణ్యక్షేత్రం (సరస్వతి అమ్మవారి సన్నిధి) దర్శనం కోసం పాదయాత్రగా బయలుదేరారు. భక్తిశ్రద్ధలతో సాగిన పాదయా యాత్ర బోరిగాం బాలాజీ గుట్ట నుండి ప్రారంభమైంది. తరలివెళ్తున్న భక్తుల బృందానికి మార్గమధ్యంలో స్థానిక ప్రజలు, నాయకులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. తానూర్ చేరుకున్న పాదయాత్ర బృందానికి స్థానికులు స్వాగతం పలికారు. సేవలో లక్ష్మీ, డాక్టర్ రాజు, సోసైటీ డైరెక్టర్ హెచ్. పుండలిక్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి వద్ద భక్తుల సేవలో భాగంగా అల్పాహారంగా ఫలాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ పుణ్యక్షేత్రాలకు పాదయాత్ర చేయడం భక్తి భావానికి నిదర్శనం అన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన భజన మండలి సభ్యులు, భక్తులు, మహిళలు, ఉత్సాహంగా పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment