మడిబాక పంచాయతీలో “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం
ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను పరామర్శించిన ఎన్డీఏ నాయకులు
మడిబాక, జూలై 29 (M4News):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనలతో మడిబాక పంచాయతీలోని SC, ST కాలనీ మరియు మడిబాక గ్రామంలో “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు, రాష్ట్ర కార్యదర్శి గురవారెడ్డి, మాజీ జెడ్పిటిసి దనంజయులు నాయుడు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి గురించి తెలుసుకొని, స్థానిక సమస్యలు MLA దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా వారు ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పేడు మండల యూనిట్ ఇంచార్జి, మాజీ సర్పంచ్ రాయపనేని రవి నాయుడు మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “సూపర్ సిక్స్” పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ ద్వారా రూ. 5000, కేంద్రం ద్వారా రూ. 2000 కలిపి మొత్తం రూ. 7000 రైతులకు అందనుందని పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభమవుతుందని వెల్లడించారు.
మడిబాక పంచాయతీ మాజీ వైస్ సర్పంచ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాయపనేని మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం “అమ్మఒడి” పథకం కేవలం ఒకరికి మాత్రమే ఇచ్చేదని, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత “తల్లికి వందనం” పథకం ద్వారా ప్రతి ఇంట్లోని అర్హులైన పిల్లలందరికీ న్యాయం జరుగుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.