ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. ముగిసిన మొదటి రోజు విచారణ..

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. ముగిసిన మొదటి రోజు విచారణ..

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు..

ముగిసిన మొదటి రోజు విచారణ..

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: సెప్టెంబర్ 29

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు మొదటి రోజు విచారణ ముగిసింది. ఇవాళ (సోమవారం) ఉదయం 11 గంటల నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ చాంబర్లో విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల తరుఫు న్యాయవాదులు పిటిషన్ దారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. విచారణకు పిటిషనర్లు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వారి తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. అలాగే.. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, వారి తరుఫు న్యాయవాదులు విచారణలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ.. సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాల జారీ చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే దానం నాగేందర్‌, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది తాము పార్టీ మారలేదంటూ అఫిడవిట్ల పూర్వకంగా వివరణ ఇచ్చారు. ఫిర్యాదుదారులూ వారికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించారు. ఈ మేరకు నాలుగు రోజులు ఎమ్మెల్యేల విచారణ కొనసాగనుంది. దీనిలో భాగంగా మొదటి రోజు విచారణ ముగిసింది. కాగా, విచారణ అనంతరం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా..? లేదా సుప్రీంకోర్టును మరికొంత సమయం కోరుతారా..? అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment