ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రథమ చికిత్సలు
బైంసా డివిజన్ అధ్యక్షులు మోహన్
తానూర్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 14
ప్రభుత్వ నిబంధనల మేరకే ఆర్ఎంపీ-పీఎంపీలు ప్రథమ చికిత్సలు నిర్వహించాలని బైంసా డివిజన్ ఆర్ఎంపి అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ అన్నారు. తానూర్ మండల కేంద్రంలో నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీలకు శిక్షణ విషయమై త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు రాత్రి పగలు అనకుండా ప్రథమ చికిత్సలు నిర్వహిస్తున్న ఆర్ఎంపీలను ప్రభుత్వం విస్మరించడం తగదని తెలిపారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే ఆర్ఎంపీలు ఉద్యమాన్ని కొనసాగిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బైంసా మండల ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు కదం అర్జున్ పాటిల్, ముధోల్ మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్, డివిజన్ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, తానూర్ మండలం మాజీ అధ్యక్షులు ప్రవీణ్, ఆర్ఎంపీలు, తదితరులు పాల్గొన్నారు.