ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి
హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమైన ఎస్పీ
నిర్మల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 25
రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు శాంతి,సహోదర వాతావరణంలో నిర్వహించబడేలా ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్, నిర్మల్ పట్టణ హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులు వారికున్న అభ్యర్థనలను,సమస్యలను శోభాయాత్ర రోజు తీసుకోవలసిన ఏర్పాట్ల గురించి ఎస్పీకి విన్నవించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ పండగ మొదలుకొని,వినాయక విగ్రహాల నిమజ్జనం వరకు చాలా క్రమబద్ధంగా, శాస్రోత్తకంగా జరిగేలా ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలని, పోలీసులు మరియు నిర్వాహకులు పరస్పర సహకారంతో పని చేయాలని తెలియజేశారు. ప్రతీ ఒక్కరు సహకరించి ఉత్సవాలను ఆనందభరితంగా, శాంతి భద్రతలతో నిర్వహించాలి. ప్రజల సహకారంతోనే పోలీసు విభాగం అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపడుతుంది అని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి మత పరమైన విభేదాలు లేకుండా సహోదర వాతావరణాన్ని కాపాడాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన ఐపీఎస్, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.