నగరంలో వైభవంగా వారాహి మాత నవరాత్రి ఉత్సవాల ముగింపు
ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త
నిజామాబాద్, జూలై 7:
అమ్మ వెంచర్ లో గల వారాహి మాత ఆలయంలో ఘనంగా నిర్వహించిన వారాహి మాత నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఉత్సవాలను మాంచాల జ్ఞానేందర్ దంపతులు అంకితభావంతో నిర్వహించారు.
ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి నగర బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“నగరంలో తొలిసారిగా ఇంత వైభవంగా వారాహి మాత నవరాత్రి ఉత్సవాలు జరగడం ఎంతో హర్షణీయం. మహిళా భక్తుల పాల్గొనడం అభినందనీయం. ఆలయ అభివృద్ధికి జ్ఞానేందర్ దంపతులు చేస్తున్న కృషి ప్రశంసనీయం. ఈ ఆలయానికి శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు ఉండడం మహత్తరమైన విషయం,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేదపండితుల పర్యవేక్షణలో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. ఆలయం అభివృద్ధికి భక్తుల సహకారం కోరుతూ ఎమ్మెల్యే గుప్త పిలుపునిచ్చారు.