ప్రమాదం భరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
ముధోల్ మనోరంజని ప్రతినిధి, జూలై 17
మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ సాయి నర్సింగ్ ఆసుపత్రి ముందర విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. గతంలో విద్యుత్ అధికారు లు ట్రాన్స్ ఫార్మర్ కు గద్దె నిర్మించారు. ఇటీవలే రోడ్డు పనుల్లో భాగంగా గద్దె రోడ్డుకు సమానంగా ఉండి ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఏర్పడిందని, పలువురు పేర్కొంటున్నారు. ఈ రోడ్డు గుండా ప్రతిరోజు ద్విచక్ర వాహనదారులు, కాలనీవాసులు, రైతులు తమ పశువులను తీసుకొని వెళ్తుంటారని ఏమాత్రం ద్విచక్ర వాహనా లు అదుపుతప్పితే ట్రాన్స్ ఫా ర్మ ర్ కు ఢీకొనే అవకాశం ఉంది. ట్రాన్స్ ఫార్మర్ రోడ్డు పక్కన ఉండి కంచె లేకపో వడంతో పశువులు, ప్రయాణికులు ప్రమా దాల బారిన పడే అవకా శాలు ఉన్నాయని గ్రామస్తులు, ప్ర యాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ ఫా ర్మర్ కు ఎత్తులో గద్దెను ఏర్పా టు చేసి కంచెను బిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.