ముధోల్ ఇందిరమ్మ కమిటి ఎన్నిక ఏకగ్రీవం*

*ముధోల్ ఇందిరమ్మ కమిటి ఎన్నిక ఏకగ్రీవంn

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

ముధోల్ : అక్టోబర్ 14

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో ఇందిరమ్మ కమిటిలను ఏకగ్రీవంగా ఎన్నికున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ గౌడ్ తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటి పథకం ప్రజలకు లబ్ది చేకూర్చడానికి ఇందిరమ్మ కమిటీలను గ్రామ పంచాయతి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు 33 ప్రకారం, 7 గురు సభ్యులు గల ఇందిరమ్మ కమిటీలో ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ శివకుమార్, ఇద్దరు ఎస్హెచ్ జి గ్రూప్ సభ్యులు టి. మహనంద, గడ్డమొల్ల చిన్నక్క, బాబాన్న, బత్తీనోళ్ళ సాయినాథ్, ఇమ్రాన్ ఖాన్, కన్వీనర్ గా ప్రసాద్ గౌడ్ సభ్యులుగా గ్రామసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు, గ్రామస్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.*

Join WhatsApp

Join Now

Leave a Comment