దుర్గ గుడికి ఆదివారం భక్తుల పోటెత్తు

దుర్గ గుడికి ఆదివారం భక్తుల పోటెత్తు

దుర్గ గుడికి ఆదివారం భక్తుల పోటెత్తు

దసరా ముగిసినా అమ్మవారి దర్శనానికి విపరీతమైన రద్దీ


విజయవాడ, అక్టోబర్ 12 (మనోరంజని తెలుగు టైమ్స్):

దసరా ఉత్సవాలు ముగిసినా అమ్మవారి భక్తి ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఆదివారం రోజు కావడంతో విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద వేకువ జాము నుంచే భక్తుల రద్దీ విపరీతంగా కనిపించింది. ఘాట్ రోడ్ నుండి ఆలయ ప్రాంగణం వరకు భక్తులు క్యూలైన్లలో నడుస్తూ దర్శనం కోసం తరలివచ్చారు.

దేవస్థానం ఈవో శీనా నాయక్ స్వయంగా దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ, సెక్యూరిటీ, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 10.30 గంటల నుండి అన్ని టికెట్ దర్శనాలను రద్దు చేసి, భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించారు.

ఈ నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ దేవస్థాన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా ఇంత భారీ భక్తుల సమూహం రావడం ఆలయ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోందని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment