దొడ్డి కొమరయ్య ఆశయాలను డీఎస్పీ కొనసాగిస్తుంది.

దొడ్డి కొమరయ్య ఆశయాలను డీఎస్పీ కొనసాగిస్తుంది.
నిర్మల్ :

నిరుపేద రైతులకు భూమి కావాలని పోరాటం చేసిన దొడ్డి కొమురయ్య ఆశయాలను ధర్మ సమాజ పార్టీ నెరవేరుస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ రామగిరి రవీందర్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అగ్రకుల భూస్వామ్య దొరలు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన వీరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆధ్వర్యంలో అణగారిన కులాలకు భూమిని,సంపదను పంచాలని బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికార పోరాటంలో కుర్మలు భాగస్వామ్యం కావాలని పిలుపును ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యక్షుడు రాజారాం,లింగన్న,సాయినాథ్,డీఎస్పీ నాయకులు రాజు మహారాజ్,భూమేశ్,కత్తి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment