ఇంద్రమ్మతో పేదల సొంతింటి కల సహకారం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 4
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంద్రమ్మతో పేదల సొంతింటి కల సహకారం అవుతుందని ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి అన్నారు. సోమవారం ముధోల్ మండలం రామ్టెక్ గ్రామంలో ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం మార్కోట్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఇంద్రమ్మ పథకం ద్వారా ఇళ్లను నిర్మించుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో అర్హులైన ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా లబ్ధిదారులు బేస్మెంట్ లెవెల్ వరకు సైతం నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. అధికారులు బేస్మెంట్ లెవెల్ వరకు ఫోటోలను తీసుకొని అప్లోడ్ చేశారు. త్వరలోనే వారికి సైతం మొదటి దశ బిల్లు వస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు త్వరగా ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భుజంగరావు పటేల్, మాజీ ఉపసర్పంచ్ భోజరామ్, సత్య భాస్కర్, తదితరులు పాల్గొన్నారు