నిర్మల్ జిల్లా ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బర్కం ప్రసాద మరియుఆమె భర్త రవి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి…..అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి barkam ప్రసాద మరియు ఆమె భర్త బర్కం రవి పై దాడి చేసిన చామకూర బొర్రన్న మరియు అతని కుటుంబ సభ్యుల్ని మరియు వాళ్ళ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి నిర్మల్ పట్టణంలోని గొల్లపేట మరియు ఏఎన్ రెడ్డి కాలనీ లోఇల్లు నిర్మాణం విషయమై ఆ ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు పక్కనే నివాసం ఉంటున్న చామకూర బొర్రాన్న మరియు అతని కుమారుడు అతని అనుచరులు ప్రసాద మరియు అతని భర్త రవి పై గడ్డపారతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించి తల పగలగొట్టారు. ఆరు కుట్లు పడ్డాయి. వెంటనే నిర్మల్ ఎస్ఐ గారికి సిఐ గారికి ఫిర్యాదు చేశారు.కానీ నేటికి వాళ్ళని అరెస్టు చేయలేదు. సాక్షులున్నప్పటికిని నిజాలు చెబుతున్నప్పటికీ అధికారులు కేసును నీరుగారుస్తున్నారు.వెంటనే వాళ్ళని అరెస్టు చేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని సిపిఐఎం మరియు ప్రజా సంఘాలు Stu భవనంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో *సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం నిర్మల్ మండల అధ్యక్షులు బర్కుంట గంగారం,బాధితులు బర్కమ్ రవి ప్రసాద, భువనగిరి సదాశివ్* పాల్గొన్నారు.
ఐద్వ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి వర్గం ప్రసాద భర్త రవి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
Published On: April 29, 2025 10:05 pm
