- బాసర ఆలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతుల ప్రత్యేక దర్శనం
- ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు
- కలెక్టర్ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన సన్మానం
బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందించారు. కలెక్టర్ దంపతులకు ఆలయ మర్యాదలతో శాలువా సమర్పించి సన్మానం చేశారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు ఆదివారం బాసరలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, వైదిక బృందం ఘన స్వాగతం పలికారు. అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి హారతి, తీర్థ ప్రసాదాలు కలెక్టర్ దంపతులకు అందజేశారు.
అమ్మవారికి అర్చనలు చేసిన అనంతరం, ఆలయ మర్యాదలతో కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులను శాలువాతో సన్మానించడం జరిగింది. వీరు ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో పూజలు కూడా నిర్వహించారు.