బీసీ రాష్ట్ర బంద్‌కు వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పూర్తి మద్దతు

బీసీ రాష్ట్ర బంద్‌కు వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పూర్తి మద్దతు

బీసీ రాష్ట్ర బంద్‌కు వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పూర్తి మద్దతు

రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ప్రకటన — 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీ వర్గాల పోరాటానికి సంఘీభావం



మనోరంజని తెలుగు టైమ్స్  గుంపుల గ్రామం, చివ్వెంల మండలం


 

  • బీసీ వర్గాల రాష్ట్ర బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి

  • 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం ఆలస్యం పై విమర్శ

  • హైకోర్ట్ స్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమితి ఐక్యతకు పిలుపు


 

రాష్ట్రంలో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కోసం అక్టోబర్ 18న జరగనున్న రాష్ట్ర బంద్‌కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ గుంపుల గ్రామంలో మాట్లాడుతూ, బీసీ వర్గాల సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి సంఘం ఐక్యంగా నిలుస్తుందని తెలిపారు.


 

రాష్ట్రంలో బీసీ వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం ఆలస్యం కావడం, జీవో 9 ఆర్డినెన్స్‌పై హైకోర్ట్ స్టే విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలో అక్టోబర్ 18న బీసీ సంఘాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఈ బంద్‌కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పూర్తి మద్దతు ప్రకటించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ తెలిపారు. శుక్రవారం చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను దృష్టిలో ఉంచుకుని 1952లో రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్లు అందించారని గుర్తు చేశారు.

అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఇంకా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలని, వారి జనాభా ప్రాతిపదికగా వర్గీకరణ అవసరమని అన్నారు. ఈ నేపథ్యంలో బీసీ వర్గాలు 42 శాతం రిజర్వేషన్ కోసం చేస్తున్న ఉద్యమానికి సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, మామిడి శివ, శివరాత్రి బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

.

Join WhatsApp

Join Now

Leave a Comment