మేడారం ఆలయ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి – మంత్రి సీతక్క
-
మేడారం ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భారీ నిధుల కేటాయింపు
-
భక్తులకు మెరుగైన దర్శనం, సదుపాయాల కోసం వేగవంతమైన పనులు
-
తల్లుల సేవలో ప్రజాసేవ కొనసాగుతుందని మంత్రి సీతక్క స్పష్టం
-
పూజారులను సంప్రదిస్తూ చారిత్రక పునరుద్ధరణ పనులు
మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకు ముక్కులు చెల్లించిన అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి భారీ నిధులు కేటాయించారని, గుడి శాశ్వతాభివృద్ధి కోసం పూజారులను సంప్రదిస్తూ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించేలా పనులు జరుగుతున్నాయని అన్నారు.
మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకు ముక్కులు చెల్లించిన అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, మేడారం ఆలయ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని, గద్దెల ప్రాంగణాన్ని విస్తరించి, భక్తులకు మెరుగైన దర్శన సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
వారం క్రితం నుంచే అభివృద్ధి పనులు మొదలయ్యాయని, ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తున్నారని చెప్పారు. భక్తుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతుందనీ, జాతర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా నిర్మాణ పనులు సాగుతున్నాయని తెలిపారు.
గుడి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని పేర్కొన్న సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ, ట్రైబల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి దశలో పూజారులను సంప్రదిస్తూ పనులు చేస్తున్నామని, గుడి నిర్మాణంలో ఆదివాసుల చరిత్ర, సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు–పగిడిద్దరాజుల త్యాగాలను ప్రతిబింబించేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
“సమ్మక్క, సారలమ్మ నాకు పునర్జన్మ ఇచ్చారు. ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లులు, ములుగు ప్రజలు నా బలం. తల్లుల సేవలో, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉంటాను. ఎవరెన్ని విమర్శలు చేసినా వెయ్యేళ్లు నిలిచేలా మేడారాన్ని అభివృద్ధి చేస్తాం,” అని మంత్రి సీతక్క అన్నారు.