కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదు.
బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.
భీమారం మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా పార్టి అధ్యక్షులు చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్కసుమన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదని అందుకే బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా భీమారం మండల కేంద్రం లో మండలం లోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణి చేసి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ పథకాలను ఎలా వివరించాలో నాయకులకు కార్యకర్తలకు తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో భీమారం మండల బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.