అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం :ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం :ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం :ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మారుస్తాం

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

మనిరణని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి ఫిబ్రవరి 11 :

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపేట వేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డి గూడెం, హైతాబాద్,అంకిగూడా,పెద్దవేడు,దమర్లపల్లి,లింగారెడ్డి గూడ,నందర్ఖాన్ పెట్ గ్రామాలలో సిఆర్ఆర్ గ్రాండ్ 55 లక్షల సి.సి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు.

అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం :ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తుచేశారు. మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజం తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు సిలిండర్, ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. త్వరలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా త్వరలోనే అందజేస్తామని సూచనప్రాయంగా తెలిపారు.ఇది వరకు గ్రామాలలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మారుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి,గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్-చైర్మన్ కావలి చంద్రశేఖర్ ,హైతాబాద్ మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి, చెన్నయ్య, మాజీ సర్పంచులు ఖజమీయ పటేల్, జనార్దన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లింగం,కాంగ్రెస్ నాయకులు వినోద్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment