ఇందిరమ్మ ఇండ్లను త్వరలో ప్రారంభించనున్న రేవంత్ సర్కార్
ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నాము
ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్: బాణావత్ గోవింద నాయక్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
ఖానాపూర్: అక్టోబర్ 18
గత ప్రభుత్వంలో ఖాళీ స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి, తర్వాత మాట మార్చి మూడు లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా, పేదల కోసం నిరంతరం కృషి చేస్తుంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల సంక్షేమం కోసం పథకాలు అందుతూనే ఉన్నాయి.
కుల మతాల తీతగా అర్హులైన పేదలకు అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని విజ్ఞప్తి చేసింది.