ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
బాసర: అక్టోబర్ 21
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీలో ఓ భారీ కొండచిలువ కొండపై నుండి దిగివచ్చి గణేష్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో చొరబడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు పాములు పట్టుకునే ఫయాజ్ ను పిలిపించి కొండచిలువను పట్టించుకున్నారు. ఇంటి యజమానితో పాటు పలువురు ఊపిరి పిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో గణేష్ నగర్ కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం భారీ కొండచిలువను పట్టించిన ఫయాజ్ అనే వ్యక్తి అటవీ అధికారులకు అప్పగించడంతో, ప్రాణమున్న కొండచిలువను పట్టుకోవడం ఔరా అనిపించే విధంగా కాలనీవాసులు ఫయాజ్ ని అభినందించారు.