వంతెన నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ కు వినతిపత్రం
తానూర్ మనోరంజిని ప్రతినిధి జూలై 28
తానూర్ మండలం ఝరి(బి), ఝరి(బి) తండా గ్రామస్తులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ కార్యాలయం ప్రజావాణి లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కి వినతి పత్రాన్ని అందించారు. దయతలచి మా యొక్క బ్రిడ్జి నిర్మాణాన్ని తొందర్లోనే నిర్మాణం చేపట్టాలని నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్కు గ్రామస్తుల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. సానుకూలంగా స్పందించి తొందర్లోనే ఎస్టిమేట్ వేసి ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో మాజీ ఎంపిటిసి జల్లేవార్ శివదాస్, ఆసం మాధవ్, బోడ్డోళ్ల యోగేశ్వర్, గుర్ల యోగేష్, గొడుగు నాగేష్, తదితరుల, ఉన్నారు