మహబూబ్ నగర్: హామీలు అమలు చేయాలని కలెక్టర్ కు వినతి
దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన అంబేడ్కర్ అభయ హస్తం రూ. 12 లక్షలు, ఎస్సీల పోడు భూములకు పట్టాలు అందిస్తామన్న హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు