సీఎం సభను విజయవంతం చేయాలి

సీఎం సభను విజయవంతం చేయాలి

నిర్మల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు పిలుపు

నిర్మల్, జనవరి 15 (మనోరంజని తెలుగు టైమ్స్):

జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సభకు మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ పదాధికారులు, సోషల్ మీడియా ఇన్‌చార్జీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మ కమిటీ చైర్మన్లు, నూతన సర్పంచులు, కార్యకర్తలు అలాగే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
జిల్లాలోని మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్ మార్ట్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొననున్నారని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment