సీఎం సభను విజయవంతం చేయాలి
– మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి
ముధోల్, జనవరి 15 (మనోరంజని తెలుగు టైమ్స్):
జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సభకు మండలంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లాలోని మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్ మార్ట్ ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొననున్నారని వెల్లడించారు.