M4News ప్రతినిధి
📍 న్యూఢిల్లీ | ఫిబ్రవరి 07
🔹 టోల్ చెల్లింపుల సమస్యకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీం
🔹 ఏటా ₹3,000, 15 ఏళ్లకు ₹30,000తో కొత్త టోల్ పాస్
🔹 దేశంలోని ఏ హైవేపైనైనా లిమిట్ లేకుండా ప్రయాణించే అవకాశం
🔹 ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజా పరిమితులను తొలగించే యత్నం
కేంద్ర ప్రభుత్వం టోల్ చెల్లింపుల భారం తగ్గించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే మధ్య తరగతి కార్ల యజమానులకు, ప్రైవేట్ వాహనదారులకు కొత్త టోల్ పాస్ తీసుకురాబోతున్నట్లు సమాచారం.
ఈ పాస్‌ను ఏడాదికి ₹3,000, 15 ఏళ్లకు ₹30,000 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి ఒక టోల్ ప్లాజాలో మాత్రమే యూజ్ చేయగల టోల్ పాస్ రూ.340 ఉంది. కానీ కొత్త పాస్‌తో ఏ నేషనల్ హైవేపైనైనా అనేకసార్లు ప్రయాణించవచ్చు.
ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు, ప్రయాణికులకు లాభం కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.