సమయానికి బస్సులు రాక భక్తులకు తప్పని తిప్పలు

సమయానికి బస్సులు రాక భక్తులకు తప్పని తిప్పలు

ఎమ్4ప్రతినిధి ముధోల్

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి సైతం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో గల పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో సమయానికి బస్సులు రాక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు బైంసా వైపు వెళ్లే బస్సులు రాక ఆలయం ముందర ప్రధాన రహదారిపై భక్తులు గంటల పాటు వేచి ఉన్నారు. ఒకేసారి బైంసా డిపోకు చెందిన నాలుగు బస్సులు రావడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయిన భక్తుల సంఖ్య భారీగా ఉండడంతో బస్సులు ప్రయాణికులతో కిక్కిరేసిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అధికారులు అరగంటకు ఒకసారైనా బైంసా- నిజామాబాద్ వైపు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment