సర్పంచ్ పదవికి వేలం పాట.. రూ.2 కోట్లకు బీజేపీ నేత ఏకగ్రీవం!!

  • పంజాబ్ లో సర్పంచ్ పదవి వేలం పాటలో ఏకంగా రూ.2 కోట్లకు బీజేపీ నాయకుడు విజయం.
  • గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబరు 15న జరగనున్నాయి.
  • కాంగ్రెస్ నేతలు దీన్ని బహిరంగ అవినీతి అని ఆరోపించారు.

 

పంజాబ్ లో హర్దోవల్ కలన్ గ్రామంలో సర్పంచ్ పదవి వేలం పాటకు రావడం చర్చనీయాంశమైంది. రూ.50 లక్షలతో ప్రారంభమైన వేలం చివరకు రూ.2 కోట్లకు చేరింది, బీజేపీ నాయకుడు ఆత్మాసింగ్ విజయం సాధించాడు. కాంగ్రెస్ నేతలు దీన్ని అవినీతి అని విమర్శించారు, జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు.

 

దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. పంజాబ్ లో ఈ క్రమంలోనే గురుదాస్పుర్ జిల్లాలోని హర్దోవల్ కలన్ గ్రామంలో సర్పంచ్ పదవిని వేలం పాటకు పెట్టడం సంచలనం సృష్టించింది. అక్టోబర్ 15న 13,237 సర్పంచ్ స్థానాల కోసం పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 4గా నిర్దేశించబడింది.

ఈ నేపధ్యంలో హర్దోవల్ కలన్ గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని వేలం పాట నిర్వహించడం సంచలనమైంది. ప్రారంభంలో రూ.50 లక్షలతో మొదలైన వేలం, రూ.2 కోట్ల వరకు వెళ్లి, ఆ సీటును బీజేపీ నేత ఆత్మాసింగ్ సొంతం చేసుకున్నాడు. గ్రామానికి నిధులు ఎక్కువగా తీసుకొచ్చేవారే సర్పంచ్ పదవికి అర్హులని, అలాంటి వారినే ప్రజలు ఎన్నుకుంటారని ఆత్మాసింగ్ ఈ సందర్భంగా తెలిపారు.

అయితే ఈ వేలం పాట అధికారికంగా జరగకపోవడం, దీనిపై తీవ్ర విమర్శలు రావడం విశేషం. కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారాన్ని బహిరంగ అవినీతి అంటూ, వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించగా, ఆత్మాసింగ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇదే విధంగా పంజాబ్ లో గతంలో బఠిండాలోని గెహ్రి బత్తార్ గ్రామంలో కూడా సర్పంచ్ పదవి వేలం పాటలో రూ.60 లక్షలకు పలికింది.

Leave a Comment