శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో సర్పపూజలు చేస్తుండగా ప్రత్యక్షమైన భారీ నాగుపాము..

శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో సర్పపూజలు చేస్తుండగా ప్రత్యక్షమైన భారీ నాగుపాము..

🐍🚩శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో సర్పపూజలు చేస్తుండగా ప్రత్యక్షమైన భారీ నాగుపాము..

అసలేం జరిగిందంటే..🖊

తిరుపతి జిల్లాలోని పవిత్రమైన శ్రీకాళ హస్తీశ్వర ఆలయంలో చాలా మంది భక్తులు వెళ్లి రాహు, కేతు దోషాలకు పూజలు చేయించుకుంటారు. ముఖ్యంగా ఇక్కడకు వచ్చి రాహు,కేతు దోషాలకు నివారణ పూజలు చేయించుకుంటే వెంటనే దాని రిజల్ట్ పాజిటివ్ గా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ కాళ హస్తిశ్వర స్వామి అంటే.. శివుడితో పాటు, అక్కడ సుబ్రహ్మణ్యుడు యదార్థంగా వెలిశారని భక్తులు నమ్ముతుంటారు.
అందుకే శ్రీకాళ హస్తిశ్వర స్వామి ఆలయంకు వచ్చి ప్రతిరోజున వేలాది మంది రాహు, కేతు దోషాల పరిహారల కోసం పూజలు చేయించుకుంటారు. ఈ క్రమంలో గ్రహాణాల సమయంలో కూడా దేశంలోని అన్ని ఆలయాలు క్లోజ్ చేస్తే.. శ్రీకాళ హస్తిశ్వర స్వామి ఆలయం మాత్రం క్లోజ్ చేయరు. ఈ క్రమంలో ఇలాంటి పవిత్రమైన ఆలయంలో రాహు కేతు దోషాల కోసం భక్తులు పూజలుచేసుకుంటుండగా.. భారీ సర్పం ప్రత్యక్షమైంది. దీంతో అక్కడున్న భక్తులు భయంతో పరుగులు తీశారు.
శ్రీకాళహస్తి ఆలయంలో రూ.750 టికెట్టు కొనుగోలు చేసి రాహు కేతు పూజల్లో పాల్గొనే మండపం మెట్ల వద్ద .. ఏకంగా భారీ నాగు పాము హల్చల్ చేసింది. ఈ క్రమంలో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే అక్కడున్న సిబ్బంది పాముల్ని పట్టే ఫారెస్ట్ అధికారికి సమాచారం ఇచ్చారు. ఆయన రంగంలోకి భారీ పామును చాకచక్యంగా పట్టుకున్నాడు.ఆ తర్వాత పామును ఒక సంచిలో వేసి దగ్గరలోని అడవిలో తీసుకెళ్లి వదిలేశారు. పామును జాగ్రత్తగా పట్టుకొవడంతో అక్కడున్న అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో రాహు కేతు దోషాల నివారణ చేసే చోట పాము రావడం శుభసూచకమని అక్కడి పండితులు కూడా చెప్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment