బిగ్ బ్రేకింగ్: జనవరిలో పంచాయతీ ఎన్నికలు!

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు 2024

తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరి 2024లో నిర్వహించబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల చేసి, జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఎన్నికల తేదీలు:
ఈసారి పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు.

  • ప్రథమ దశ: జనవరి 21
  • ద్వితీయ దశ: జనవరి 25
  • తృతీయ దశ: జనవరి 30

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ ముగిసిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు.

పోటీకి అర్హతలు:

  • రెండు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న అభ్యర్థులు అర్హులు కారు.
  • 1995 జూన్ 1 తర్వాత మూడో సంతానం ఉంటే పోటీ చేయరాదు.
  • ఒకే కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే మాత్రం పోటీలో పాల్గొనవచ్చు.
  • పోటీకి కనీస వయస్సు 21 సంవత్సరాలు.
  • అభ్యర్థి గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి.
  • వార్డు సభ్యులు లేదా సర్పంచ్ అభ్యర్థులకు ప్రతిపాదకుడు అదే గ్రామంలో ఓటరుగా ఉండాలి.
  • స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు పోటీ చేయరాదు.
  • దేవాదాయ సెక్షన్ 15 కింద సంస్థలలో పనిచేసేవారు అర్హులు కారు.
  • ప్రభుత్వం నిర్వహించే సంస్థల్లో 25% కంటే ఎక్కువ పెట్టుబడులు ఉన్న సంస్థల మేనేజర్లు, ఏజెంట్లు పోటీ చేయరాదు.
  • ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు.

రిజర్వేషన్ల ప్రక్రియ:
పంచాయతీలు మరియు వార్డులకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీల కార్యకలాపాలు వేగవంతమవుతాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment