రబింద్ర ప్రధానోపాధ్యాయుడికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 15
మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్ర స్కూల్ ప్రధానోపాధ్యాయులు అసంవార్ సాయినాథ్ ను అనందిత ఫౌండేషన్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు- 2025 కార్యక్రమంలో సన్మానించింది. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మన్ ఆనంద్ రావు పటేల్, విద్యాధికారి సుబాష్, ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు. అసంవార్ సాయినాథ్ దశాబ్ద కాలంగా విద్యారంగంలో వినూత్న పద్ధతులతో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్న అసంవార్ సాయినాథ్ ను మిత్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, అభినందించారు.