బైంసాలో ఇంటి గణపతుల నిమజ్జనం ప్రారంభం
బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 4
భైంసా పట్టణంలో భక్తులు తమ ఇళ్లల్లో ప్రతిష్టించిన ఘనపతుల నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తిశ్రద్ధలతో ఇళ్లల్లో ప్రతిష్టించి ఉదయం సాయంత్రం సమయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు నియమ నిష్ఠలతో విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించి వీడ్కోలు పలికారు. తమ బంధువులతోపాటు తిరుగు పురుగు వాళ్లను పూజలకు ప్రతిరోజు ఆహ్వానించారు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో నిమజ్జోత్సవాల నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.