దేశాన్ని కదిలించిన బీసీ బంద్ – సంపూర్ణం
తెలంగాణ బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతమైందని వివిధ పార్టీలు, బీసీ సంఘాలు, వ్యాపార, విద్యాసంస్థలు ధన్యవాదాలు తెలిపారు.
భైంసా పట్టణం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనలో పాల్గొన్న సుంకేట పోశెట్టి నేతలు బీసీ సోదరులు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొని దేశాన్ని కదిలించేలా విజయవంతం చేశారని కొనియాడారు.
బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం జారీ చేసిన జీవో 9 పై హైకోర్ట్ స్టే ఇచ్చిన దానిని బీసీ నాయకులు నిరసించగా, ఎన్నికలను వాయిదా వేయడం అన్యాయం అని విమర్శించారు. బీసీల ఆత్మగౌరవం, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో సరైన ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే వర్గాలు కోర్టులను వేదికగా చేసుకుని అడ్డుకుంటున్నాయని, ఇది బీసీ ఉద్యమానికి చీకటి రోజు అని తెలిపారు. అవసరమైతే ఢిల్లీలో కూడా ఉద్యమానికి సిద్ధమని స్పష్టం చేశారు.
ఈ బంద్ కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన పార్టీలు పాల్గొన్నారు.