నిరాధార ఆరోపణలు మానుకోవాలి.
కాంగ్రెస్ నాయకుడు వేల్పుల శ్రీనివాస్.
మంచిర్యాల మనోరంజని ప్రతినిధి.
సోషల్ మీడియాలో తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని భీమారం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వేల్పుల శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా మంత్రి వివేక్ వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తున్నాను, మంత్రి నాకు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళుతున్నాను.ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం నాపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు నేను భీమారం గ్రామంలోని పోతనపల్లి వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఫేక్ లెటర్ ప్యాడ్ సృష్టించి భూ కబ్జాకు ప్రయత్నించినట్టు దుష్ప్రచారం చేస్తూ నా పరువుకు భంగం కలిగించారు, కానీ వాస్తవమైన విషయం ఏమిటంటే భీమారం గ్రామానికి చెందిన జాడి రమాదేవి, భర్త పేరు రాజారాం, అనే మహిళ రాష్ట్ర మంత్రి కి 12 -07-25 తేదీన దరఖాస్తు పెట్టుకున్నది. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఉండడానికి గుడిసె వేసుకోవడానికి స్థలము లేనందున మంత్రి కి విన్నవించు కొనగా మంత్రి స్పందించి భీమారం తహసిల్దార్ కి వినతి పత్రంపై దీనిని పరిశీలించాలని రాశారు, కానీ కొందరు దానిని వక్రీకరించి అది ఫేక్ లెటర్ లెటర్ ప్యాడ్ గా చిత్రీకరించారు, నాకు ప్రజల్లో మరియు మంత్రి వద్ద ఉన్న మంచి పేరును చెడగొడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను అని అన్నారు