14న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ రాక
మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్
బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 12
డిసిసి నూతన అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియలో భాగంగా కార్యకర్తల అభిప్రాయ సేకరణకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ డాక్టర్ అజయ్ సింగ్ రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తెలిపారు. మంగళవారం బైంసా పట్టణంలోని గౌరీ ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం పరిశీలకులు వస్తున్నారని ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పదాధికారులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్, పార్టీ యువజన, మహిళ, రైతు, విద్యార్థి విభాగం, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఆత్మ చైర్మన్లు, డైరెక్టర్లు, పిసిసి సభ్యులు, సేవాదళ్ అధ్యక్షులు, పట్టణ, మండలాల అధ్యక్షులు, మాజీ కౌన్సులర్లు, ఎన్ఎస్ యుఐ నాయకులు, యూత్ అధ్యక్షులు, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు పాల్గొనాలని కోరారు.