చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
ఆగస్టు 18 కుంటాల: నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోసి గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సోమవారం కుంటాల మండలంలోని మండల రజక సంఘం నాయకులు పడకండి దత్తు, సిబిల దత్తాత్రి, కాశీరాం గజేందర్, గడ్డపు గజేందర్, ఆలూరు ప్రవీణ్, గజ్జరం, కృష్ణ కుంటాల మండల తహసిల్దార్ కమల్ సింగ్ నాయక్ గారికి వినతి పత్రం అందజేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు