వేల్పూర్‌లో ఉద్రిక్తత

వేల్పూర్‌లో ఉద్రిక్తత

వేల్పూర్‌లో ఉద్రిక్తత

బీఆర్‌ఎస్ – కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

📍 వేల్పూర్‌, నిజామాబాద్ జిల్లా – జూలై 18 (M4News)

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరుగ్యారంటీలు ఇంకా లబ్ధిదారులకు అందలేదని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతలు ఆందోళనకు దిగారు. అయితే, లబ్ధిదారులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసానికి తీసుకువస్తామని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు.

ఈ నేపథ్యంలో వేల్పూర్‌కు చేరేందుకు యత్నించిన కాంగ్రెస్ నేత మోహన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు, బీఆర్‌ఎస్ నాయకులను కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి ముందు బీఆర్‌ఎస్ కార్యకర్తలు గుమికూడగా, వారిని అక్కడే నిలిపివేశారు. ఈ క్రమంలో పోలీసులు–కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ప్రజలకు హామీగా ఇచ్చిన ఆరుగ్యారంటీల అమలుపై రెండు పార్టీల మధ్య పదునైన విమర్శలతో వాతావరణం వేడెక్కింది.

Join WhatsApp

Join Now

Leave a Comment