శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు..

శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు..

శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు..

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి, అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. భక్తులు దానధర్మాలు, నదీ స్నానాలు చేస్తూ పుణ్యం సంపాదించుకుంటున్నారు.

నంద్యాల :

శ్రీశైలంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామిఅమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శాన్నికి 2 గంటల సమయం పడుతుంది.

వరంగల్ :

కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి, పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. వరంగల్ వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

నల్లగొండ :

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణంతో శివాలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుండే అలయాలకు చేరుకొని కార్తీక దీపాలు వెలిగించి, భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు.

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఝారాసంగం కేతకి సంగమేశ్వర, సంగారెడ్డి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.

భద్రాద్రి కొత్తగూడెం

కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, పూజలు చేస్తున్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment