దేవస్థాన నిధులు ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకూడదు: వెంకయ్య నాయుడు!*

*దేవస్థాన నిధులు ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకూడదు: వెంకయ్య నాయుడు!*

చిత్తూరు జిల్లా:జులై 28*

తిరుమల శ్రీవారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, వీఐపీల శ్రీవారి దర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలో హిందువులకు స్ఫూర్తి కేంద్రం తిరుమల. భక్తులు సమర్పించే కానుక లను ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాలని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వం రాజకీయ జోక్యం చేసుకోకుండా ఉండాలన్నారు.

ప్రతి ఊరిలో గుడి కట్టడా నికి టీటీడీ ముందుకు రావాలని కోరారు. గుడి, బడి లేని ఊరు ఉండకూడ దు. బడి కట్టించడం ప్రభుత్వ కర్తవ్యం.. గుడి కట్టించడం దేవస్థానాల ప్రధాన కర్తవ్యం కావాలని సూచించారు.దేవస్థానం నిధులు ప్రభుత్వ కార్యక్ర మాలకు, ఇతరత్రాలకు ఖర్చు పెట్టకూడదు. కేవలం దేవాలయం అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మాత్రమే వినియోగించాలి,అన్నారు.

ప్రజాప్రతినిధులు, వీఐపీలు ఏడాదిలో ఒకేసారి దర్శనా నికి రావాలి. వీఐపీలు తమవారిని పరిమితంగా దర్శనానికి తీసుకురావాలి. అలాచేస్తే సామాన్య భక్తుల కు ఇబ్బంది కలుగకుండా ఉంటుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment