తెలంగాణ రాష్ట్ర గొర్రెల,మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం.
మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
డాక్టర్ రాజాబాహదూర్ గౌర్ విజ్ఞాన కేంద్రం హిమాయత్ నగర్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తి దారుల సంఘం రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా వృత్తి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు హాజరయి ప్రసంగిస్తూ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అన్నారు నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత సహకార సంఘాలను విభజన చేయకుండా సహకార సంఘాలకు ఎన్నికలు జరపకుండా సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయడం తో సహకార వ్యవస్థ చిన్నాభిన్నమై వృత్తిదారులకు తీరని శాపంగా మారిందన్నారు వెంటనే విభజించి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. పాడి పశువులు గొర్రెలు మేకలను అడవిలో మేపుకొనుటకు హక్కుని కల్పించాలని ప్రమాదవశాత్తు మరణించిన జీవాలకు గొర్రెలకు మేకలకు నష్టపరిహారం ఇవ్వాలని చదువుకున్న యువతి యువకులకు పశుసంవర్ధక శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పాల ఉత్పత్తి అభివృద్ధి చెందడానికి మినీ పాల డైరీలకు 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని 50దాటిన వృద్ధులకి 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలని ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరులకు 20 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించి నెలలు గడిచిన ఆమోదించకుండా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీసీలందరూ ఐక్యంగా పోరాడాలి అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ సహకార సంఘాల ఎన్నికల సాధనకై ఆగస్టు 11 సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మరియు పశుసంవర్ధక శాఖ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని మండలానికి ఒక వారసంత నియోజకవర్గానికి ఒక్క కమ్యూనిటీ హాల్ జిల్లాకు ఒక మానస విక్రియ కేంద్రం కేటాయించాలని అన్నారు జిల్లా అధ్యక్షులకు నియోజకవర్గ అధ్యక్షులకు మండలాధ్యక్షుడు పిలుపునిచ్చారు సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లడంగి శ్రావణ్ కుమార్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికి రెడ్డి బుచ్చన్న యాదవ్ రాష్ట్ర సలహాదారు గుడిగె శ్రీనివాస్ యాదవ్ మత్స్య కార్మిక సంఘం సంఘం రాష్ట్ర అధ్యక్షులు దిటి నరసయ్య రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ, సంఘ నాయకులు పి బాలయ్య యాదవ్, చేగొండ రాజన్న యాదవ్, చిగుర్ల శ్రీనివాస్, చౌడేపల్లి పర్వతాలు యాదవ్, కంప సాల వెంకన్న, ఈ రి భూమయ్య,నంగి కనుకయ్య అన్న మలేష్ యాదవ్, ఐలయ్య, రాజేష్ యాదవ్, తదితర నాయకులు పాల్గొన్నారు