తెలంగాణ మద్యం షాపుల టెండర్లు.. ఆంధ్రప్రదేశ్ మహిళ 150 దరఖాస్తులతో కలకలం
తెలంగాణ మద్యం షాపుల టెండర్లు.. ఆంధ్రప్రదేశ్ మహిళ 150 దరఖాస్తులతో కలకలం
తెలంగాణలో మద్యం షాపుల లైసెన్సుల దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. ఈ టెండర్ల ప్రక్రియలో భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే శనివారం ఒక్కరోజే 30,000కు పైగా దరఖాస్తులు రాగా, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 90,000 దరఖాస్తులు అందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఏపీకి చెందిన ఒక మహిళ ఏకంగా 150 వైన్ షాపులకు దరఖాస్తు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని జిల్లాల్లో ఉన్న దుకాణాల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది